గౌరవ ముఖ్యమంత్రి శ్రీ
@ncbn గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించాను. వంశధార నిర్వాసితులపై గతంలో నమోదు చేసిన కేసులను మానవతా దృష్టితో ఉపసంహరించి వారికి న్యాయం చేయాలని, జల్ జీవన్ మిషన్ కింద వెనక్కు మళ్లించబడిన సుమారు ₹110 కోట్ల నిధులను తక్షణమే పునరుద్ధరించి ఎగువ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశాను. అలాగే మహేంద్ర తనయ & వంశధార నదులపై నూతన వంతెనల మంజూరు, ప్రధాన రహదారుల డబుల్ రోడ్ల విస్తరణ, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరాను.
భగీరథపురం–హిరమండలం వంశధార నది వంతెన, కల్లట–జిల్లేడుపేట వద్ద మహేంద్ర తనయ నది వంతెన, బూరగాం గ్రామ రైతుల రక్షణ కోసం వంతెన నిర్మాణం, అలాగే కె.గోపాలపురం & ఎం.గోపాలపురం గ్రామాల ప్రజల ప్రాణ భద్రత కోసం నూతన వంతెన మంజూరు వంటి అత్యవసర అవసరాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. వరద ముప్పు గ్రామాలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశాను. నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినట్లు తెలియజేస్తూ, ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు మరింత కృషి చేస్తానని స్పష్టం చేస్తున్నాను.
#Pathapatnam
#MamidiGovindaRao
#ChandrababuNaidu
#DevelopmentForAll
#BridgeInfrastructure
#JalJeevanMission