ధర్మవరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎ. శ్యామ్ ప్రసాద్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ మంత్రి మౌర్య భరద్వాజ్ గారితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ అంశాలపై శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించాను.
ధర్మవరం అభివృద్ధికి కీలకమైన MSME పార్కుల ఏర్పాటు, మోలకవేముల విద్యుత్ ఉపకేంద్రం పూర్తి, నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతుల బలోపేతం, పిన్నదరిలో నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల పూర్తి, ఆయుర్వేద కళాశాల నిర్మాణం, మహిళ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు, గ్రామీణ రహదారుల అభివృద్ధి, చెరువుల మరమ్మతులు, క్రీడా మౌలిక వసతులు, కదిరి గేట్ వద్ద ఆర్ఓబీ నిర్మాణం, సాగు, తాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నాను.
పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించాను.
#Dharmavaram
#DevelopmentReview
#ReviewMeeting
#GoodGovernance
#InfrastructureDevelopment
#AndhraPradesh
#PublicService
#DharmavaramDevelopment