అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.
రైతులు నష్టపోకుండా ప్రత్యేక చర్యలు.
కొనుగోలు కేంద్రాల్లో వేగవంతంగా ధాన్యం సేకరణ
అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ధాన్యం తడిసిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గారు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వేగంగా కొనుగోళ్లు నిర్వహిస్తోందని తెలిపారు.
ములుగు జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా అకాల వర్షాల ప్రభావంతో ధాన్యం తడిసిన పరిస్థితులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. అనుకొని పరిస్థితుల వర్షాలతో ధాన్యం తడిసినా, నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రైతులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 76 వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేయగా, రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర కింద రూ. 141 కోట్ల పైగా జమ చేయడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా 9 వేల కు పైగా రైతులు లబ్ధి పొందినట్లు తెలిపారు.
అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపడుతోందన్నారు. అవసరమైన చోట టార్పాలిన్లు, నిల్వ సదుపాయాలు, వేగవంతమైన రవాణా ఏర్పాట్లు కల్పిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన అన్ని ఏజెన్సీలు, సంబంధిత శాఖల అధికారులు, డీఆర్‌డీఓలు, డీసీఓలు, జీసీసీ ప్రతినిధులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్‌లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వర్షాలు వచ్చే పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యానికి వర్షం వల్ల ఎలాంటి నష్టం కలగకుండా అవసరమైన చోట టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలని సూచించినట్లు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు సమీప కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులకు ధాన్యం కొనుగోలులో సమస్యలు, సందేహాల పరిష్కారం కోసం జిల్లా సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్/కంట్రోల్ రూం నంబర్ 9347416178 ను సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
@TelanganaCMO @UttamINC @TelanganaCS @revanth_anumula
#PaddyProcurement #PaddyPurchase #FarmerSupport #MSP #FoodSecurity #RiceProcurement #ProcurementDrive #FarmerWelfare #Agriculture #PaddyFarmers #धानखरीदी #CropProcurement #GrainCollection #FarmerIncome #RythuBandhu #PublicDistribution #ProcurementCenter #FarmToMarket #RuralDevelopment #AgriSupport