అమరావతిలో మహిళల సాధికారత, స్వయం ఉపాధి కోసం “ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్” ప్రారంభం
✅ప్రజారాజధాని అమరావతిలోని యర్రబాలెం గ్రామంలో సిఆర్డిఏ ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధి, సాధికారత పెంపొందించడం కోసం 26 రోజులపాటు నిర్వహించే “ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(EDP)”ను 2025 అక్టోబర్ 16న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని
@GuideFoundation ,
@EDIIAhmedabad ,
@Accenture సంస్థలతో కలిసి అమరావతిలో అమలు చేయడం జరుగుతోంది.
✅ఈ కార్యక్రమం ద్వారా రాజధాని ప్రాంత మహిళలు, నిరుద్యోగ యువతకు వ్యాపార నిర్వహణకు అవసరమైన సాంకేతిక, ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం జరుగుతుంది. అమరావతి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఆహార సంబంధిత అనుబంధ రంగాలలో ఉన్న వ్యాపార అవకాశాలను వినియోగించుకునే దిశగా ఈ శిక్షణా కార్యక్రమాలు స్థానికులకు దోహదపడేలా నిర్వహించడం జరుగుతోంది. అమరావతి మహిళలు సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించేలా, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు సహకరించండం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.
✅ఈ శిక్షణా కార్యక్రమాలు మందడం, అనంతవరం-తుళ్లూరు మండలం, ఉండవల్లి రూరల్- తాడేపల్లి మండలం, యర్రబాలెం- మంగళగిరి గ్రామాల్లో నిర్వహించబడుతున్నాయి. ప్రస్తుతం అనంతవరం, ఉండవల్లి, యర్రబాలెం గ్రామాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతి బ్యాచ్‌లో 26 రోజులపాటు బిస్కెట్లు, స్నాక్స్, సాంప్రదాయ స్వీట్స్, టిఫిన్ పదార్థాలు, మరియు మిల్లెట్ ఆధారిత పోషకాహార ఉత్పత్తుల తయారీపై శిక్షణ అందించడం జరుగుతుంది. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. జీవనోపాధి నైపుణ్యాలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందేందుకు మహిళలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గురువారం యర్రబాలెంలో మొదలైన శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీకృష్ణ ఎం.కె.ఎస్, ఈడీఐఐ అహ్మదాబాద్ నుంచి ప్రాజెక్టు అధికారి ఎడ్మండ్ భూపతి, జీఎఫ్‌ఎఫ్‌డీ ప్రాజెక్టు డైరెక్టర్ డా.మాధవీలత, ప్రాజెక్టు మేనేజర్ రుబిందర్ కౌర్, మాస్టర్ ట్రైనర్ సురేంద్రకుమార్, సిఆర్డీఏ లైవ్‌లీహుడ్ స్పెషలిస్ట్ ఎస్.వి. నరసింహం, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
✅ఈ యొక్క శిక్షణ కార్యక్రమాల యొక్క పూర్తి వివరాల కోసం కింది నెంబర్లలో సంప్రదించవచ్చు:
ఎస్.వి. నరసింహం, లైవ్‌లీహుడ్ స్పెషలిస్ట్, ఏపీ సీఆర్డీఏ — 9550311637
రుబిందర్ కౌర్, ప్రాజెక్టు మేనేజర్, జీఎఫ్‌ఎఫ్‌డీ — 9618374402
#Amaravati #APCRDA #WomenEmpowerment #Entrepreneurship #SelfEmployment #SkillDevelopment #EDP #LivelihoodDevelopment #SustainableGrowth #EmpoweringCommunities #PrajaRajadhani #PeoplesCapital #AndhraPradesh