మేడారం అభివృద్ధి పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
భక్తులకు శాశ్వత సౌకర్యాలను కల్పించాలి
మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తి భావం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క
@seethakkaMLA గారు అధికారులను ఆదేశించారు.
తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్‌లో మంత్రి దనసరి అనసూయ సీతక్క గారు, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గారితో కలిసి మేడారం అభివృద్ధి పనుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ మేడారం మహాజాతర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని, జాతర సమయంలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆలయ ప్రాంగణం, జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, ప్రధాన రహదారులు, భక్తుల రాకపోకల మార్గాలను నిరంతరం పరిశీలిస్తూ, ఆలయ ప్రాంగణంలో భద్రత, పరిశుభ్రత, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వనదేవతల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో శాశ్వత నిర్వహణ వ్యవస్థ ఉండేలా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక మెయింటెనెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. భక్తుల నుంచి వచ్చే సమస్యలకు వెంటనే స్పందించే విధంగా సమన్వయ వ్యవస్థ రూపొందించాలని సూచించారు.
సమ్మక్క-సారలమ్మ ఆలయానికి గోదావరి పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున ముందస్తుగా మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు.
శాశ్వత స్నాన ఘట్టాలు, విశ్రాంతి గదులు, ఇతర సౌకర్యాలను దశల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జంపన్నవాగు ప్రాంతాన్ని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
మేడారం పరిసర ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, వనదేవతల ఆలయ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, డీఎఫ్‌వో వికాస్ మీనా, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావు, జిల్లా అధికారులు, పూజారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO @revanth_anumula @TelanganaCS
#MedaramJathara #MedaramTemple #Telangana #Mulugu #Tourism #GodavariPushkaralu #TempleDevelopment #God #Devotional