🛣️✨ డోలి రహిత మన్యమే లక్ష్యంగా - జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించే దిశగా - డోలీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించిన - జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు
జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించే డోలి రోడ్ల నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత, పారదర్శకతతో పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా మొత్తం 81 డోలి రోడ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, రూ. 106.28 కోట్ల బడ్జెట్ కేటాయించబడింది. ప్రస్తుతం 50 రోడ్ల పనులు గ్రౌండింగ్ దశలో ఉండగా, మిగిలిన 31 రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
పాలకొండ పీఆర్ డిపార్ట్‌మెంట్ పరిధిలో 23 పనులు, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 4 పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని సమీక్షలో వెల్లడైంది.
📊 పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పనులు పూర్తయ్యే వరకు బిల్లులు పెండింగ్‌లో ఉంచరాదని కలెక్టర్ గారు స్పష్టం చేశారు.
ఈ నెలాఖరులోగా రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఈఈలు, ఏఈలకు దిశానిర్దేశం చేశారు.
📸 ప్రతి రోడ్డు పనికి ప్రారంభ దశ, నిర్మాణ దశ, పూర్తి దశలో తప్పనిసరిగా ఫోటోలు తీసి భద్రపరచాలని, ఏఈలు రోజువారీ ప్రగతి నివేదికలను ఫోటోలతో సమర్పించాలని ఆదేశించారు.
ఈఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల నాణ్యతను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని పేర్కొన్నారు.
⚠️ మంజూరైన రోడ్ల విషయంలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా, అవసరమైన రోడ్లు వేయాలని తెలిపారు.
డోలి రహిత మన్యమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి గిరిజన గ్రామాలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని కలెక్టర్ గారు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి గారు, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గారు, డ్వామా పీడీ కె. రామచంద్రరావు గారు, ఈఈలు, ఏఈలు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
#DoliFreeManyam
#RoadDevelopment
#TribalConnectivity
#InfrastructureProgress
#ParvathipuramManyam
#salur #parvathipuram #palakonda #kurupam
#prabhakarareddynakkala @prabhakarareddy
#trending #viral #instagram #facebook