ఆందోళనకర స్థాయిలో దళితులపై పెరిగిన దాడులు – జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు
రాష్ట్రంలో జరిగే అన్యాయాలపై పోరాటం ఆగదు - ఎంపీ మద్దిల గురుమూర్తి.
న్యూఢిల్లీ : రాష్ట్రంలో దళితులపై దాడులు, అణచివేత చర్యలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న పరిస్థితులపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ పత్రికా ముఖంగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన తెనాలిలో దళితుడిపై పోలీసులు పాశవికంగా దాడి చేసిన అంశాన్ని సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ అంశంపై వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి స్పందిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడే సీరియస్‌గా స్పందించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్దం చేసుకోవాలన్నారు. దళితులపైనే దాడులు చేసి వారిపైనే కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు బనాయించి, జైల్లో వేసి వేధిస్తున్నారని మండిపడ్డారు.
చుండూరు, కారంచేడు, తెనాలి, చీరాల వంటి అనేక వరుస సంఘటనల్లో దళితులపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కమిషన్లు, మానవ హక్కుల కమిషన్‌ల దృష్టికి రాష్ట్రంలో జరిగే అన్యాయాలను ఎప్పటికప్పుడు తీసుకువెళుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
దళితుల భూములు లాక్కోవడం వంటి అంశాలపై మొత్తం 86 కేసులు నమోదయ్యాయని, వాటిపై విచారణ జరుగుతుందని, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో భూములు లాక్కోవడం, కౌలు ఇవ్వకపోవడం వంటి అంశాలపై కేసులు ఎస్సీ కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు స్వయానా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు తెలపడం, రాష్ట్రంలోని దారుణ పరిస్థితులకు అద్దం పడుతోందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.
#Adminpost #DalitRights #YSRCP #YSJaganmohanreddy #SocialJustice #StopCasteAtrocities #JusticeForDalits #SCCommission #NationalSCCommission #DalitAtrocities #HumanRights #SaveConstitution #RuleOfLaw #AndhraPradesh #APPolitics #CoalitionGovernment #TDPFailures #YSRCP #MPGurumoorthy #MaddilaGurumoorthy #YSJagan #StandWithDalits #FightForJustice #TirupatiMP #MPTirupati #TeamGuru