ఈరోజు మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు, ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రజాస్వామ్య పండుగలో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు అభివృద్ధిని ఆశీర్వదించే నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నాను. ప్రజా ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈరోజు మధిర పట్టణంలోని 9వ వార్డులో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన సాధనం. అభివృద్ధి దిశగా ఆలోచించి ప్రతి పౌరుడు ఓటు వేయాలి.
ప్రపంచీకరణ తరువాత గ్రామాలు పట్టణాలుగా మారుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు అర్బన్, పరీ-అర్బన్, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ విభాగాలుగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాం.
విద్య, వైద్యం, మౌలిక వసతులు, పరిశ్రమలు - ఈ నాలుగు ప్రధాన స్తంభాలపై అభివృద్ధి నిర్మాణం జరుగుతోంది. గాలి నాణ్యత పెంపు, బ్యాటరీ వాహనాల ప్రోత్సాహం, ఎస్టిపిల నిర్మాణం, చెరువుల పరిరక్షణ మరియు పార్కుల అభివృద్ధి వంటి చర్యలు పట్టణాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేపడుతున్నాం.
నాణ్యమైన విద్యుత్తు సరఫరా, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా ఉచిత శిక్షణ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు - ఇవి యువత భవిష్యత్తుకు పెట్టుబడులు.
పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఇంద్రమ్మ ఇళ్ల ద్వారా పేదలకు గృహ భద్రత కల్పిస్తున్నాం.
అభివృద్ధి నిరంతర ప్రక్రియ. దీనిని వేగవంతం చేయాలంటే స్థానిక సంస్థల్లో కూడా అభివృద్ధి దృక్పథం ఉన్న నాయకత్వం అవసరం
#TelanganaDevelopment #DemocracyInAction #VoteForDevelopment #UrbanTransformation #3TrillionEconomyVision #InfrastructureGrowth #WomenEmpowerment #YouthEmployment #EducationReforms #GreenTelangana #PublicGovernment #CongressForDevelopment #ManaBhattiVikramarka